తల్లి, తన ఐదేళ్ల కుమారుడుతో కలిసి అదృశ్యమైంది.
నెల్లూరు(క్రైమ్): తల్లి, తన ఐదేళ్ల కుమారుడుతో కలిసి అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే నగరంలోని గిడ్డంగి వీధి సమీపంలోని మకాన్‌వీధిలో బాబర్ సంజయ్ కుటుంబం నివాసముంటోన్నారు. ఆయన బంగారుబట్టి నిర్వహిస్తున్నారు. సంజయ్ తన పెద్దకుమారుడు మహదేవ్‌కు సుమారు ఏడేళ్లకిందట హేమారాణితో వివాహం చేశారు. వారికి ఒక కుమారుడు(భావేశ్) జన్మించాడు. అందరూ ఉమ్మడిగా ఉండటంతో మహదేవ్ అతని భార్య నడుమ మనస్పర్థలు చోటుచేసుకొన్నాయి.
మహదేవ్ వ్యాపార నిమిత్తం నాలుగునెలల కిందట మహారాష్ట్రకు వెళ్లారు. ఈనేపథ్యంలో ఈనెల 20వ తేదిన టైలర్ వద్ద జాకెట్లు ఇచ్చివస్తానని చెప్పి హేమారాణి తన కుమారుడు భావేష్‌ను తీసుకొని ఇంట్లోనుంచి బయటకు వెళ్లింది. అక్కడ నుంచి ఆమె అదృశ్యమైంది. బాధిత కుటుంబసభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల, బందువుల ఇళ్లలో గాలించారు. ఫలితం లేకపోవడంతో మంగళవారం మూడోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడోనగర ఎస్‌ఐ ఎస్ వెంకటేశ్వరరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.