నీరు-చెట్టులో మితిమీరిన అవినీతి | Water-tree excessive corruption | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టులో మితిమీరిన అవినీతి

Jun 24 2016 4:01 AM | Updated on Sep 4 2017 3:13 AM

నీరు-చెట్టులో మితిమీరిన అవినీతి

నీరు-చెట్టులో మితిమీరిన అవినీతి

నీరు-చెట్టు పథకంలో అధికార పార్టీ నాయకులు మితిమీరిన అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు......

►  వాటాల కోసం అధికారులపై టీడీపీ నాయకుల ఒత్తిడి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి

 
నెల్లూరు(సెంట్రల్):  నీరు-చెట్టు పథకంలో అధికార పార్టీ నాయకులు మితిమీరిన అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు.  స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరు చెట్టు పథకం  టీడీపీ నాయకుల ఇళ్లలో అవినీతి చెట్టుగా మారిందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి పనిలో టీడీపీ నేతలు వాటాలు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రతి పనికీ అధికారులపై వాటాల కోసం ఒత్తిడి తెస్తున్నారన్నారు. మామూళ్లు ఇవ్వని అధికారులను ఏసీబీకి పట్టిం చడం వంటి పనులకు కూడా టీడీపీ నాయకులు పూనుకునే స్థాయికి చేరుకున్నారన్నారు. 

నీటి సంఘాల ఎన్నికల్లో కూడా దౌర్జన్యాలకు పాల్పడి వైఎస్సార్‌సీపీ ఉన్న చోట కూడా బలవంతంగా టీడీపీ నాయకులనే నీటి సంఘాల అధ్యక్షులుగా నియమించారని ఆరోపించారు. వారిని అడ్డంపెట్టుకుని నీరు చెట్టు పథకంలోని ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. నీరు చెట్టు పథకం కింద కోట్ల రూపాయలు అవినీతి పాల్పడుతున్నారన్నారు. కండలేరు, నెల్లూరులోని భూగర్భడ్రెయినేజీ  తదితర పనులను సొంత కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు.

సంగం బ్యారేజీ పనులు నత్త నడకన సాగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల పరిశీలించినా ఏ మాత్రం మార్పు లేదన్నారు. ఈ పనుల విషయలో అంచనాలు పెంచి కమీషన్ల కో సం కక్కుర్తి పడుతున్నారన్నారు. కొన్ని శా ఖల అధికారుల వద్ద బలవంతంగా మా మూళ్లు తీసుకుంటూ వారిచేత అవినీతి చేయించడం నిజం కాదా అని ప్రశ్నిం చారు.  జిల్లా యువత విభాగం అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, బీసీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య, శివప్రసాద్, చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి విష్టువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement