బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు పోయగా వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మానుకోట పట్టణంలోని ఓ బంకులో సోమవారం రాత్రి జరిగింది. బాధిత వాహనదారుల కథనం ప్రకారం... పట్టణంలో నర్సంపేట రోడ్డులో ఉన్న బంకులో కృష్ణ, శ్రీను, జవహర్, మధు తమ వాహనాల్లో పెట్రోల్ పోయిం చేందుకు బంకుకు వచ్చారు.
-
ఆందోళనకు దిగిన వాహనదారులు
మహబూబాబాద్ : బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు పోయగా వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మానుకోట పట్టణంలోని ఓ బంకులో సోమవారం రాత్రి జరిగింది. బాధిత వాహనదారుల కథనం ప్రకారం... పట్టణంలో నర్సంపేట రోడ్డులో ఉన్న బంకులో కృష్ణ, శ్రీను, జవహర్, మధు తమ వాహనాల్లో పెట్రోల్ పోయిం చేందుకు బంకుకు వచ్చారు. పెట్రోల్ పో యించుకొని కొద్ది దూరం వెళ్లలా వాహనాలు నిలిచాయి. వెంటనే మెకానిక్ షాప్ వద్దకు తీసుకెళ్లగా వాహనం పెట్రోల్ ట్యాంకులో నీళ్లు ఉన్నాయని చూపాడు. దీంతో వారు బంక్ వద్ద కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ విషయంపై యజమాని వాహనాలను మరమ్మతు చేయిస్తానని హామీ ఇచ్చాడు. పెట్రోల్ తెచ్చిన ట్యాంకర్‌లోనే నీళ్లు వచ్చాయని బంక్ సిబ్బంది చెబుతున్నారు. కాగా ఇదే బంకులో నీళ్లు రావడం ఇది రెండోసారి. అప్పుడు కూడా వాహనదారులు ఆందోళనకు దిగారు.