పేరూర్‌ డ్యామ్‌కు నీరందే దాకా ఉద్యమిస్తాం | water give to perur dam | Sakshi
Sakshi News home page

పేరూర్‌ డ్యామ్‌కు నీరందే దాకా ఉద్యమిస్తాం

Apr 14 2017 11:44 PM | Updated on Sep 5 2017 8:46 AM

పేరూర్‌ డ్యామ్‌కు నీరు వచ్చే వరకు ఉద్యమిస్తామని జలసాధన కమిటీ సభ్యులు మల్లెల గంగాధర్, కె.శ్రీనివాసులు, హుసేన్, మెహరున్‌బీ, మునీర్, బోయశ్రీనివాసులు, జాఫర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతపురం అర్బన్‌ : పేరూర్‌ డ్యామ్‌కు నీరు వచ్చే వరకు ఉద్యమిస్తామని జలసాధన కమిటీ సభ్యులు  మల్లెల గంగాధర్, కె.శ్రీనివాసులు, హుసేన్, మెహరున్‌బీ, మునీర్, బోయశ్రీనివాసులు, జాఫర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జలసాధన కమిటీపై చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.  పేరూర్‌ డ్యామ్‌కు 2015, 2016లో కేటాయించిన రూ.840 కోట్లు ఎక్కడికి వెళ్లాయని వారు ప్రశ్నించారు.

ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్‌లో రూ.840 కోట్ల నుంచి రూ.640 కోట్లకు ఎందుకు తగ్గించాల్సి వచ్చిందన్నారు. కేటాయించిన నిధులకు అనుమతి ఎప్పడిస్తారు? పనులు ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా పూర్తి చేసి డ్యామ్‌కు నీరు తీసుకొస్తారో టీడీపీ నాయకులు స్పష్టంగా చేయగలరా అని ప్రశ్నించారు. ఆ ధైర్యం ఉంటే మంత్రులతో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement