విద్యుత్‌ రైలుమార్గం తనిఖీ | vidyut train track checkings | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ రైలుమార్గం తనిఖీ

Jun 21 2017 10:36 PM | Updated on Sep 5 2017 2:08 PM

గుంతకల్లు - పెండేకల్లు - డోన్‌ల మధ్య 70 కిలోమీటర్ల మేర రైలు మార్గం విద్యుదీకరణ పనులను బుధవారం దక్షిణ మధ్య రైల్వే భద్రత కమిషనర్‌ రామ్‌క్రుపాల్‌ తనిఖీ చేశారు.

గుంతకల్లు : గుంతకల్లు - పెండేకల్లు - డోన్‌ల మధ్య 70 కిలోమీటర్ల మేర రైలు మార్గం విద్యుదీకరణ పనులను బుధవారం దక్షిణ మధ్య రైల్వే భద్రత కమిషనర్‌ రామ్‌క్రుపాల్‌ తనిఖీ చేశారు. గుంతకల్లు డీఆర్‌ఎం అమితాబ్‌ఓజాతో కలిసి ప్రత్యేక రైలులోని టవర్‌కార్‌ (ప్రత్యేకబోగీ)లో ప్రయాణించిన ఆయన అడుగడుగూ క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడక్కడా కనిపించిన చిన్న లోటుపాట్ల గురించి అధికారులతో మాట్లాడి తగు సూచనలిచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ మార్గంలో విద్యుత్‌ రైలింజన్‌కు అనుమతిలిచ్చే అవకాశం ఉందని డివిజనల్‌ అధికారులు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement