కనీస వేతనాలు చెల్లించాలి | velugu department demanding for salary hike | Sakshi
Sakshi News home page

కనీస వేతనాలు చెల్లించాలి

Apr 10 2017 4:01 PM | Updated on Sep 5 2017 8:26 AM

కనీస వేతనాలు చెల్లించాలి

కనీస వేతనాలు చెల్లించాలి

యానిమేటర్స్‌లకు కనీస వేతనం రూ 5వేల రూపాయలు చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : వెలుగులో పని చేస్తున్న యానిమేటర్స్‌లకు కనీస వేతనం రూ 5వేల రూపాయలు చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని సీఐటీయు కార్యాలయంలో జిల్లా విసృత స్దాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెలుగు విఓలకు జాతీయ గ్రామీణ జీవనోపాధి పధకం కింద గ్రామస్దాయిలో పని చేస్తున్న యానిమేటర్స్‌లకు సంవత్సరాల తరబడి వెట్టి చాకిరి చేయించుకుంటూ వారికి కనీస వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో యానిమేటర్స్‌ ప్రభుత్వ గుర్తింపు, వేతనాల కోసం అనేక పోరాటాలు చేస్తే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం సెర్ప్‌ నుండి రూ 2వేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించిందన్నారు. టిడిపి ప్రభుత్వం యూనిమేటర్స్‌పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికి వేతనాలు మాత్రం ఇంతవరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ప్‌ హెల్ప్‌ గ్రూపుల ట్రైనరీ పేరుతో యానిమేటర్స్‌ చేసే పనులతో పాటు పొదుపు సంఘాలకు శిక్షణ పేరుతో వీరిని తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పదించి యానిమేటర్స్‌కు గుర్తింపు కార్డులు అందజేసి పనిభారాన్ని తగ్గించాలన్నారు. లేనిపక్షంలో అందోళన బాట పడతామన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు ప్రభుదాస్, శేఖర్, రత్నం, రామాంజులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement