ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి | two students dies after drown in water in bibinagar | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

Oct 23 2016 4:15 PM | Updated on Apr 3 2019 8:07 PM

ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి - Sakshi

ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

బీబీనగర్ మండలం గూడూరు శివారులోని తెన్నేటి వాగులో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

యాదాద్రి: పుట్టిన రోజు వేడుకల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో ఆదివారం చోటుచేసుకుంది. భువనగిరి పట్టణంలోని ప్రెసిడెన్సీ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అదే పాఠశాలకు చెందిన విద్యార్థి రంజిత్ పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు బీబీనగర్ మండలం గూడూరుకు వెళ్లారు. అక్కడ గ్రామం పక్కన గల పొలాల్లోని చెట్ల కింద ఆడుతూపాడుతూ గడిపారు.

ఈ క్రమంలో స్నేహితులంతా అక్కడి చిన్నేరువాగులో స్నానాలు చేశారు. వీరిలో సోమారపు సాయికిరణ్ (15), మెడిగే నిఖిల్ (17) 10వ తరగతి విద్యార్థులు పొలాల పక్కన ఉన్న గూడూరు గ్రామంలోకి కూల్‌డ్రింక్స్ తెస్తామని వెళ్లారు. వీరు తిరిగి వచ్చే సరికి స్నేహితులంతా స్నానాలు చేయడంతో వాగులో నీరు బురదగా మారాయి. దాంతో వీరిద్దరూ వాగుకు కొంచెం దూరంలోకి వెళ్లి స్నానం చేసేందుకు ప్రయత్నించగా నీటిలో మునిగిపోయారు. స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మృతి చెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement