నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
రెండు ప్రైవేట్ బస్సులు సీజ్
Dec 11 2016 1:01 AM | Updated on Aug 25 2018 6:21 PM
అనంతపురం సెంట్రల్ : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగానే అనంతపురం నగర సమీపంలోని తపోవనం, గుత్తి టోల్‌ప్లాజా వద్ద చేసిన తనిఖీల్లో నిబంధనలు పాటించని 10 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు మోటర్ వెహికల్ ఇ¯Œ్సపెక్టర్ వరప్రసాద్ తెలిపారు. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా బెంగుళూరు టూ హైదరాబాద్‌కు తిరుగుతున్న ఆరంజ్ ట్రావెల్స్, పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు తిరుగుతున్న బీఎల్‌ఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.
Advertisement


