వ్యక్తిగత కక్షతో జంట హత్యలు | two persons killed brutally in kakinada | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత కక్షతో జంట హత్యలు

Mar 2 2017 6:54 PM | Updated on Jul 30 2018 9:21 PM

తనకు వ్యతిరేకంగా యజమానికి ఫిర్యాదు చేశాడనే కోపంతో ఓ వ్యక్తి ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు.

కాకినాడ సిటీ(తూర్పుగోదావరి):
తనకు వ్యతిరేకంగా యజమానికి ఫిర్యాదు చేశాడనే కోపంతో ఓ వ్యక్తి ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన బడుగు బాలగంగాధర తిలక్‌ (48) కాకినాడ రామారావుపేటలో కర్రీ పాయింట్‌ నడుపుతున్నాడు. ఈ కర్రీ పాయింట్‌కు సమీపంలోనే ఉన్న సుబ్బయ్య హోటల్‌లో జగన్నాథపురానికి చెందిన అడ్లబోయిన అశోక్‌కుమార్‌ అనే వ్యక్తి వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు.

తిలక్‌ కారణంగానే తన యజమాని తనపై ఆగ్రహంగా ఉన్నాడని అశోక్‌కుమార్‌ భావించాడు. దీంతో అతడిని చంపేందుకు కుట్ర పన్నాడు. తిలక్‌తోపాటు అతడి స్నేహితుడు జగడం రామస్వామి బుధవారం అర్థరాత్రి తమ ద్విచక్రవాహనాలపై వస్తుండటం గమనించిన అశోక్‌కుమార్‌ తన వ్యాన్‌తో వారిని వెంబడించి ముందుగా తిలక్‌ వాహనాన్ని ఢీకొట్టాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో గాయపడిన తిలక్‌ను, అడ్డురాబోయిన రామస్వామిని విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో వారు అక్కడే చనిపోయారు. ఈ ఘటనలో అశోక్‌కుమార్‌ ఒక్కడే పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నా, వాస్తవానికి నలుగురైదుగురు ప్రమేయం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement