తెలంగాణ రాష్ట్ర ఎన్‌పీడీసీఎల్ గ్రేడ్ ‘బీ’ నుంచి ‘ఏ’కు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది.
టీఎస్ ఎన్‌పీడీసీఎల్‌కు ‘ఏ’ గ్రేడ్
Aug 24 2016 12:25 AM | Updated on Sep 4 2017 10:33 AM
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ఎన్‌పీడీసీఎల్ గ్రేడ్ ‘బీ’ నుంచి ‘ఏ’కు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. తద్వారా గతంలో కంటే అధిక మొత్తంలో రుణాలు సులువుగా పొందే అవకాశం సంస్థకు లభిస్తుంది. ఆయా నిధులతో మెరుగైన విద్యుత్ పంపిణీ, కొత్త సబ్‌స్టేçÙన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించనున్నారు. వీటితో పాటు నష్టాల తగ్గింపు, వ్యయాల కుదింపు, మరిన్ని ఆదాయ మార్గాల అన్వేషణపై దృష్టిసారించనున్నారు.
Advertisement
Advertisement