టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభం | TRS Government Collapse Beginning | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభం

Nov 17 2016 3:21 AM | Updated on Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభం - Sakshi

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభం

రాష్ట్రంలో మోసపూరి త వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజాసమస్యలను గాలికి వదిలేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
 
 హుజూర్‌నగర్: రాష్ట్రంలో మోసపూరి త వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజాసమస్యలను గాలికి వదిలేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.  దళితులకు మూడెకరాలు,  రుణమాఫీ, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపడతానని కేసీఆర్ హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కానీ  సీఎంబంగళాను 9 ఎకరాల్లో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్నారని విమర్శించారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, దివంగత సీఎం వైఎస్ రాజ శేఖరరెడ్డిలు ఇచ్చిన టికెట్లతో పోటీ చేసి గెలుపొంది పార్టీ ఫిరారుుంపులకు పాల్పడ్డారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఫిరారుుంపునకు పాల్పడిన గుత్తా ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తామన్నారు. గుత్తా రాజీనామా చేస్తే  అధిష్టానం ఆదేశిస్తే ఆ స్థానంలో ఎంపీగా పోటీ చేసి గెలుస్తానన్నారు. అభివృద్ధిలో అగ్రభాగాన రాష్ట్ర ప్రభుత్వం దూసు కుపోతోందని మాటలు చెపుతున్న కేసీఆర్ ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించలేని దుస్థితికి ఈ రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement