
అవే బారులు.. అవే బాధలు
అనంతపురం నగరంలో పీటీసీ నుంచి కళ్యాణదుర్గం వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్‌జామ్ అవుతోంది.
అనంతపురం నగరంలో పీటీసీ నుంచి కళ్యాణదుర్గం వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్‌జామ్ అవుతోంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పాపు కిలోమీటర్‌పైగా వాహనాలు బారులు తీరుతుండడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. కిలోమీటర్ ఉన్న బ్రిడ్జిని దాటడానికి వాహనదారులకు గంటకు పైగా సమయం పడుతోంది. ట్రాఫిక్ సమస్యతో ఉదయం పూట విద్యార్థులు సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు బ్రిడ్జి మధ్యలో డివైడర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తే సమస్య కొద్దిగైనా పరిష్కారం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
-సాక్షి, ఫొటోగ్రాఫర్, అనంతపురం