మహబూబ్‌నగర్ క్రైం : పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో శనివారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో పలు చోట్ల ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
Aug 28 2016 12:54 AM | Updated on Sep 4 2017 11:10 AM
– 40మంది మైనర్లు అదుపులోకి..
మహబూబ్‌నగర్ క్రైం : పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో శనివారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో పలు చోట్ల ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లపై ప్రత్యేక దష్టి సారించారు. 13నుంచి 17ఏళ్ల వయస్సు కలిగిన అబ్బాయిలు త్రిబుల్ రైడింగ్ చేస్తూ 40మంది పట్టుపడ్డారు. అదేవిధంగా ఉదయం పూట మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 5మందిపై కేసులు నమోదు చేశామని, వాహనాలను సీజ్ చేశామని ఎస్‌ఐ శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం వారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. తనిఖీలు రోజూ కొనసాగుతాయని అన్నారు.
Advertisement
Advertisement