ట్రాక్టర్‌ బోల్తా..డ్రైవర్‌ మృతి | tractor rolls and one dies | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా..డ్రైవర్‌ మృతి

Aug 15 2017 10:54 PM | Updated on Sep 17 2017 5:33 PM

ట్రాక్టర్‌ బోల్తా..డ్రైవర్‌ మృతి

ట్రాక్టర్‌ బోల్తా..డ్రైవర్‌ మృతి

మండలంలోని బసినేపల్లి తండా శివార్లలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి వద్ద పొలంలో మంగళవారం ట్రాక్టర్‌ టిల్లర్‌ అదుపు తప్పి గుంతలో పడి డ్రైవర్‌ బండారు నాగరాజు(35) మృతి చెందాడు.

గుత్తిరూరల్‌: మండలంలోని బసినేపల్లి తండా శివార్లలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి వద్ద పొలంలో మంగళవారం ట్రాక్టర్‌ టిల్లర్‌ అదుపు తప్పి గుంతలో పడి డ్రైవర్‌ బండారు నాగరాజు(35) మృతి చెందాడు. వివరాలు. జి.ఎర్రగుడికి చెందిన బండారు నాగరాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివార్లలో పొలంలో పెద్ద రాళ్లను ట్రాక్టర్‌ టిల్లర్‌తో తొలగించేందుకు వెళ్లాడు.

వెనుక వైపు గుంత ఉంటడం గమనించకుండా ట్రాక్టర్‌ రివర్స్‌లో వేగంగా తీసుకెళ్లడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌ నాగరాజుపై ట్రాక్టర్‌ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య యమున, ఇద్దరు వికలాంగ కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement