
సాగరతీరంలో పర్యాటకుల కోలాహలం
తోటపల్లిగూడూరు : ప్రముఖ పర్యాటక ప్రాంతం కోడూరు బీచ్ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం భక్తులతో రద్దీగా ఉండే కోడూరు బీచ్‌కు రొట్టెల పండగ సందర్శకులు కూడా తోడవ్వడంతో మరింత కిక్కిరిసి పోయింది. విద్యార్థులు, యువత తమ తల్లిదండ్రులతో సేద తీరేందుకు సాగరతీరం చెంతకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో కోడూరు సాగరతీరంలో పండుగ వాతావరణం నెలకొంది. సందర్శకులు గంటలకొద్ది సముద్రంలో జలకాలాడారు.