బీచ్‌కు మరిన్ని సొబగులు | touches on beach | Sakshi
Sakshi News home page

బీచ్‌కు మరిన్ని సొబగులు

Aug 4 2016 1:51 AM | Updated on Sep 4 2017 7:40 AM

బీచ్‌కు మరిన్ని సొబగులు

బీచ్‌కు మరిన్ని సొబగులు

బీచ్‌ సుందరీకరణకు మరిన్ని మెరుగులు దిద్దాలని జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ కొత్తజాలరిపేట, ఓడీఎఫ్‌ కమిటీ సభ్యులతో మాట్లాడి బహిరంగ మలవిసర్జన అరికట్టాడానికి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు.

ద్వారకానగర్‌ :  బీచ్‌ సుందరీకరణకు మరిన్ని మెరుగులు దిద్దాలని జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ కొత్తజాలరిపేట, ఓడీఎఫ్‌ కమిటీ సభ్యులతో మాట్లాడి బహిరంగ మలవిసర్జన అరికట్టాడానికి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. విశాఖను ఓడీఎఫ్‌ నగరంగా తీర్చిదిద్దాడానికి ఎంతో కృషి చేస్తున్నామని.... ప్రజలు ప్రజా మరుగుదొడ్లను వినియోగించుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బీచ్‌లోని గోకుల్‌ పార్కు, రాక్‌ గార్డెన్స్, జీవీఎంసీ పార్కు, వరుణ్‌ పార్కులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.  ఐఆర్‌ఎఫ్‌కు కోట్లాది రూపాయలతో సుందరీకరణించినప్పటకీ తదుపరి నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించలేదని అభిప్రాయపడ్డారు. 15 రోజులకోసారి పుట్‌ఫాత్‌లను నీటితో శుభ్రం చేయాలని సూచించారు. బీచ్‌ను మరింత అందంగా తీర్చిదిద్దాడానికి అనువైన నీడనిచ్చేచెట్లను నాటాలని కోరారు. ఆర్‌కేబీచ్‌లో తొలగించిన బెంచీల స్థానంలో మళ్లీ ఏర్పాటు చేసి పరిసరాలను సుందరంగా తీర్చాదిద్దాలన్నారు. ఆయన వెంట జోనల్‌ కమిషనర్లు నల్లనయ్య, వి. చక్రధర్‌రావు, ఈఈలు రత్నాలరాజు, కష్ణారావు, సుధాకర్, మహేష్,  ఎం. దామోదర్, ఏఎంవోహెచ్‌ డా. మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement