నాణ్యమైన భోజనం అందించాలి | To give quality food | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం అందించాలి

Sep 16 2016 7:56 PM | Updated on Aug 29 2018 4:18 PM

నాణ్యమైన భోజనం అందించాలి - Sakshi

నాణ్యమైన భోజనం అందించాలి

నల్లగొండ టూటౌన్‌ : జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని స్థాయి సంఘం చైర్మన్‌ బసవయ్య అధికారులను కోరారు.

నల్లగొండ టూటౌన్‌ : జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని స్థాయి సంఘం చైర్మన్‌ బసవయ్య అధికారులను కోరారు. శుక్రవారం జెడ్పీ చైర్మన్‌ చాంబర్‌లో తన అధ్యక్షతన జరిగిన 6వ స్థాయి సంఘం సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించి నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్కాలర్‌షిప్‌ పొందే విద్యార్థులలో సీలింగ్‌ విధానం విధించడం సరైంది కాదన్నారు. కల్యాణ లక్ష్మి నిధులు సకాలంలో లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఏఓ శైలజ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement