మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ కడపజిల్లా వీరబల్లి శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సెంట్రింగ్ కర్రలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా.. కొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం సమీపంలోనే వ్యవసాయ బావి ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అనుకుంటున్నారు.