ఫిల్మింనగర్ ప్రమాదంలో ముగ్గురి అరెస్టు | three arrested in filmnagar incident | Sakshi
Sakshi News home page

ఫిల్మింనగర్ ప్రమాదంలో ముగ్గురి అరెస్టు

Jul 28 2016 11:16 PM | Updated on Apr 3 2019 7:53 PM

పోర్టికో కూలిన ఘటనలో ముగ్గురుని అరెస్ట్ నిందితులను గురువారం పోలీసులు చేశారు.

బంజారాహిల్స్‌: ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో ఈనెల 24న నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలి ఇద్దరు కూలీలు మృతి, 8 మందికి తీవ్రగాయాలైన ఘటనలో బంజారాహిల్స్‌ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సైట్‌ ఇంజినీర్‌ ఎం.సుధాకర్‌రావు, లేబర్‌ కాంట్రాక్టర్‌ ఈ.కొండల్‌రావు, సెంట్రింగ్‌ కాంట్రాక్టర్‌ ఎ.బాలరాజులపై పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 304(ఏ), 337, 338, 288, 461 క్లాజ్‌ –4 ఆఫ్‌ జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోర్టిగో నిర్మాణం జరుగుతుండగా వీరంతా తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా సెంట్రింగ్‌ పిల్లర్లు సరిగా వేయకపోవడంతో అవి కదిలి కుప్పకూలినట్లు కూడా వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement