ఖమ్మం జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు
కైకొండాయగూడెం(ఖమ్మం): ఖమ్మం జిల్లాలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని కైకొండాయిగూడెంలోని ఓ ఇంట్లోకి గుర్తుతెలియన ఐదుగురు దుండగులు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను కత్తులు, తుపాకీతో బెదిరించి వారిని ఓ గదిలో తాళ్లతొ కట్టేశారు. డబ్బులు, నగలు ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు.
తీవ్ర భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు వారి వద్ద 10 తులాల బంగారం, నగదు వారికి ఇచ్చారు. దాంతో పాటు నాలుగు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు కూడా దుండగులు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.