కుటుంబసభ్యులంతా ఎండా కాలం వేడికి తట్టుకోలేక ఆరుబయట నిద్రించగా అదును చూసి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి సొత్తంతా మూటగట్టుకు పోయారు.
కమలాపురం(వైఎస్సార్): కుటుంబసభ్యులంతా ఎండా కాలం వేడికి తట్టుకోలేక ఆరుబయట నిద్రించగా అదును చూసి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి సొత్తంతా మూటగట్టుకు పోయారు. తెల్లారిన తర్వాత విషయం తెలుసుకున్న బాధితులు ఘొల్లుమన్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టణానికి బూతం సాంబశివుడు, ఆయన కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి ఆరుబయట పడుకున్నారు. ఇదే అదనుగా ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించిన దొంగలు .. బీరువాను పగులగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదును ఎత్తుకుపోయారు. తెల్లవారిన తర్వాత చూసుకున్న సాంబశివుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై శ్రీనివాసులురెడ్డి సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌టీంను రప్పించి, విచారణ ప్రారంభించారు.