23న పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి గడువు | The final deadline for entries on 23 PG courses | Sakshi
Sakshi News home page

23న పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి గడువు

Aug 20 2016 12:10 AM | Updated on May 25 2018 3:26 PM

కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో మొదటిదశలో సీట్లు అలాట్‌మెంట్‌ అయిన విద్యార్థులు కళాశాలల్లో చేరే గడువును ఈనెల 20 నుంచి 23 వరకు పొడిగించినట్లు కేయూ అడ్మిషన్ల డైరెక్ట ర్, ప్రొఫెసర్‌ ఎం. కృష్ణారెడ్డి, జాయింట్‌ డైరెక్ట ర్లు వెంకయ్య, లక్ష్మణ్‌నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కేయూ క్యాంపస్‌ : కాకతీయ, శాతవాహన యూ నివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో మొదటిదశలో సీట్లు అలాట్‌మెంట్‌ అయిన విద్యార్థులు కళాశాలల్లో చేరే గడువును ఈనెల 20 నుంచి 23 వరకు పొడిగించినట్లు  కేయూ అడ్మిషన్ల డైరెక్ట ర్, ప్రొఫెసర్‌ ఎం. కృష్ణారెడ్డి, జాయింట్‌ డైరెక్ట ర్లు వెంకయ్య, లక్ష్మణ్‌నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
 
సీట్లు అలాట్‌మెంట్‌ అయిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో 23 వర కు రిపోర్టు చేయా లన్నారు. ముందుగా ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ ద్వారా లేకుంటే ఎస్‌బీఐ బిల్‌డెస్క్‌ ద్వా రా ఫీజు చెల్లించాలన్నారు. ఫీజు చెల్లించిన 24 గంటల తర్వాత అడ్మిషన్‌lకార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. తర్వాత అడ్మిషన్‌కార్డు, ఒరి జనల్‌ సర్టిఫికెట్లతో 23లోగా కళాశాలల్లో రిపోర్టు చేయాలన్నారు. గతంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కు రానివారు ఈనెల 25, 26 తేదీల్లో హాజరుకావచ్చన్నారు. విద్యార్థులు ఈనెల 25 నుంచి 30 వరకు స్లైడింగ్‌ వెబ్‌ ఆప్షన్లు చేసుకోవచ్చన్నారు. సీటు అలాట్‌మెంట్‌ రెండో జాబితాను సె ప్టెంబర్‌ 2న వెల్లడించనున్నట్లు తెలిపారు. మరి న్ని వివరాలకు కేయూ వెబ్‌సైట్, అడ్మిషన్ల వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. సంస్కృతం, హిందీ, ఎం ఐటీ, ఉర్దూ, ఫుడ్‌సైన్స్‌ టెక్నాలజీ, నానో టెక్నాలజీ కోర్సులకు ఈనెల 24న ఉద యం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, సీట్‌అలాట్‌మెంట్‌ ఉంటుందన్నారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement