పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు | tenth exams deo checking | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు

Mar 27 2017 11:31 PM | Updated on Sep 26 2018 3:25 PM

పారదర్శకంగా  పదో తరగతి పరీక్షలు - Sakshi

పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు

మామిడికుదురు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయని డీఈఓ ఎస్‌.అబ్రహం తెలిపారు. ఆయన సోమవారం మామిడికుదురు, మొగలికుదురు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో

-మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి పటిష్ట చర్యలు
-డీఈఓ అబ్రహం
మామిడికుదురు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయని డీఈఓ ఎస్‌.అబ్రహం తెలిపారు. ఆయన సోమవారం మామిడికుదురు, మొగలికుదురు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. మొగలికుదురు పరీక్షా కేంద్రంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించానని, అక్కడ ఏవిధమైన మాస్‌ కాపీయింగ్‌ జరగడం లేదని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకన వి«ధానం వల్ల విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులూ పడడం లేదన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగేందుకు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించామన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత వరకు ముగ్గురు విద్యార్థులను డీబార్‌ చేశామని, ఒక చీఫ్‌ సూపరింటెండెంట్, ఒక డీఓ, ఆరుగురు ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement