బాలకృష్ణ దండ వేశాకే.. | tdp leaders ovar action in ambedkar jayanthi celebrations in hindupur | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ దండ వేశాకే..

Apr 14 2016 12:08 PM | Updated on Aug 17 2018 8:11 PM

బాలకృష్ణ దండ వేశాకే.. - Sakshi

బాలకృష్ణ దండ వేశాకే..

అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీనేతల దౌర్జన్యం ఎక్కువైంది.

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీనేతల దౌర్జన్యం ఎక్కువైంది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన  వైఎస్సాసీపీ  నియోజక వర్గ ఇంచార్జి నవీన్ నిశ్చల్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. తమ  ఎమ్మెల్యే బాలకృష్ణ దండ వేసిన తర్వాత మిగతా వారు వేసుకోవాలని వితండవాదానికి దిగారు. దీంతో నవీన్ టీడీపీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని పూలమాల వేయనివ్వడంతో గొడవ సద్దుమణిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement