‘ప్రైవేట్‌’లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు | taskfors cheking in pvt schools | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు

Jul 30 2016 11:50 PM | Updated on Sep 4 2017 7:04 AM

‘ప్రైవేట్‌’లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు

‘ప్రైవేట్‌’లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు

మండలంలోని అనంతారం, నాగులపాటి అన్నారం, చీదెళ్ల గ్రామాలతోపాటు మండల కేంద్రంలోని శ్రీ అరబిందోమాత, అక్షర, స్నేహ, శ్రీ వాగ్ధేవి ప్రైవేట్‌ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు.

పెన్‌పహాడ్‌ : మండలంలోని అనంతారం, నాగులపాటి అన్నారం, చీదెళ్ల గ్రామాలతోపాటు మండల కేంద్రంలోని శ్రీ అరబిందోమాత, అక్షర, స్నేహ, శ్రీ వాగ్ధేవి ప్రైవేట్‌ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం  టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పి.రాధాసింగ్, డి.వీరయ్య మాట్లాడుతూ అర్హత కలిగిన వారినే ఉపాధ్యాయులుగా నియమింపజేయాలని.. సరైన వసతులు కల్పించాలని, ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రామాంజనేయులు, శంకర్, పాఠశాలల కరస్పాండెంట్‌లు నాగయ్య, షేక్‌ మస్తాన్, సైదులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement