అరటి చెట్ల నరికి వేత | Strangers cut the Banana trees | Sakshi
Sakshi News home page

అరటి చెట్ల నరికి వేత

Oct 21 2016 10:51 PM | Updated on Sep 4 2017 5:54 PM

అరటి చెట్ల నరికి వేత

అరటి చెట్ల నరికి వేత

రాచకుంటపల్లెలోని రైతు ఎర్రగోర్ల శేఖర్‌కు చెందిన అరటి తోటను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి నరికివేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ రాచకుంటపల్లెకి వెళ్లి అరటి తోటను పరిశీలించారు.

వేముల: రాచకుంటపల్లెలోని రైతు ఎర్రగోర్ల శేఖర్‌కు చెందిన అరటి తోటను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి నరికివేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ రాచకుంటపల్లెకి వెళ్లి అరటి తోటను పరిశీలించారు. అరటి చెట్లను నరికిన ప్రాంతంలో దుండగుల ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అని నిశితంగా పరిశీలించారు. అనంతరం బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తనకున్న 2.50 ఎకరాల్లో నాలుగు నెలల క్రితం అరటి సాగు చేశానని శేఖర్‌ తెలిపారు. సుమారు 250 చెట్లను నరికివేశారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు తోటలోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి అరటి తోటను సాగు చేస్తే నడి వయస్సు వచ్చిన తర్వాత నరికివేయడంతో బాధితుడు లబోదిబోమంటున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు జరగలేదని గ్రామస్తులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement