నిమజ్జనంలో ఘర్షణ.. ఒకరికి కత్తిపోటు | Stab someone immersed in the clash .. | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో ఘర్షణ.. ఒకరికి కత్తిపోటు

Sep 15 2016 12:09 AM | Updated on Aug 3 2018 2:57 PM

కత్తి పీటతో ఒకరి తలపై మరో వ్యక్తి దాడి చేసిన సంఘటన మండల కేంద్రంలోని రేకులతండాలో బుధవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకా రం... తండాలోని గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులంతా కలిసి గత ఏడాది మాదిరిగానే ఈ సారి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

  • లడ్డు దక్కలేదనే అక్కసుతోనే దాడి ?
  • కేసముద్రం : కత్తి పీటతో ఒకరి తలపై మరో వ్యక్తి దాడి చేసిన సంఘటన మండల కేంద్రంలోని రేకులతండాలో బుధవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకా రం... తండాలోని గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులంతా కలిసి గత ఏడాది మాదిరిగానే ఈ సారి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉత్సవ కమిటీ స భ్యుల్లో లడ్డూ పాటకు పోటీ జరిగింది. ఈ పోటీలో తేజావత్‌ లాల్‌సింగ్‌ రూ.12,200కు లడ్డూను దక్కించుకున్నా డు. ఈ క్రమంలో లడ్డుకు పోటీకి దిగిన ఓ వ్యక్తి ఊరేగిం పు మొదలయ్యాక లాల్‌సింగ్‌తో గొడవకు దిగాడు. ఈ క్ర మంలో గొడవకు దిగిన వ్యక్తి ఇంట్లో ఉన్న కత్తిపీట తెచ్చి లాల్‌సింగ్‌ తలపై కొట్టాడు. దీంతో తలకు లోతుగా కాటుపడి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో గొడవను అడ్డుకోవడానికి వచ్చిన లచ్చు చేతికి గాయమైంది. ఈ గొడవలో లాల్‌సింగ్‌పై మరో ఇద్దరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తండావాసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిం చారు. లాల్‌సింగ్‌ను మానుకోట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తండాకు చేరుకుని విచారణ చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement