'టీడీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదు' | somu veerraju takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

'టీడీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదు'

Oct 25 2015 12:16 PM | Updated on Mar 29 2019 8:30 PM

'టీడీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదు' - Sakshi

'టీడీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదు'

చంద్రబాబు సర్కార్పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విమర్శలు గుప్పించారు.

గుంటూరు: చంద్రబాబు సర్కార్పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం గుంటూరులో సోము వీర్రాజు మాట్లాడుతూ... రాష్ట్రంలో పథకాల అమలుకు కేంద్ర నిధులే వాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం విడుదల చేసిన నిధులతోనే రుణమాఫీ చేస్తున్నారని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కేంద్రం అందించిన నిధులను వాడుతున్నా... టీడీపీ నేతలు మాత్రం ఆ అంశంపై ఎక్కడా చెప్పడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదానే కాదు... ప్రత్యేక నిధులు కూడా ఏమీ నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేయలేదని ప్రతిపక్షాలతోపాటు కాంగ్రెస్, వామపాక్ష పార్టీలు... బీజేపీపై నిప్పులు చెరుగుతున్న క్రమంలో సోము వీర్రాజుపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement