
15 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు
భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర మహాసభలు ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సంఘం తూర్పు జోన్ కార్యదర్శి ఎన్.కోటి తెలిపారు. గవర్నర్‌పేట మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల గోడపత్రికలను శనివారం విడుదల చేశారు.
విజయవాడ(బస్‌స్టేషన్) : భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర మహాసభలు ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సంఘం తూర్పు జోన్ కార్యదర్శి ఎన్.కోటి తెలిపారు. గవర్నర్‌పేట మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల గోడపత్రికలను శనివారం విడుదల చేశారు. కోటి మాట్లాడుతూ మహాసభలను భీమవరంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విదేశీ విద్యాసంస్థలకు అనుమతులిస్తూ, స్వదేశీ విద్యాలయాలకు అవకాశం లేకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుఉ మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలోఎస్‌ఎఫ్‌ఐ నగర ఉపాధ్యక్షుడు యేసుబాబు,సాయిహసీనా పాల్గొన్నారు.