విద్యార్థులు తమ తల్లితండ్రులను సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపే విధంగా ప్రోత్సహించాలని సేంద్రియ వ్యవసాయ అవార్డు గ్రహీత కర్ర శశికళారెడ్డి సూచించారు.
సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపాలి
Jul 21 2016 1:06 AM | Updated on Jun 4 2019 5:04 PM
తుంగతుర్తి : విద్యార్థులు తమ తల్లితండ్రులను సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపే విధంగా ప్రోత్సహించాలని సేంద్రియ వ్యవసాయ అవార్డు గ్రహీత కర్ర శశికళారెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘సేంద్రియ వ్యవసాయం.. మెలకువలు’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ రంగంలో విద్యార్థులు తమ తల్లితండ్రులకు సహాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగేశ్వర్‌రావు, యాదగిరి రెడ్డి, వాసు, గణేష్, దయాకర్, శోభారణి, భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement