చౌలమద్దిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా... | role model the choullamaddi | Sakshi
Sakshi News home page

చౌలమద్దిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా...

Jul 21 2016 10:06 PM | Updated on Sep 4 2017 5:41 AM

తన స్వగ్రామం చౌలమద్దిని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు. మండలంలోని తన స్వగ్రామం చౌలమద్దిలో గురువారం మొక్కలు నాటి మాట్లాడారు.

  • జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ
  • మెట్‌పల్లిరూరల్‌: తన స్వగ్రామం చౌలమద్దిని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు.  మండలంలోని తన స్వగ్రామం చౌలమద్దిలో గురువారం మొక్కలు నాటి మాట్లాడారు. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల, ఇంకుడుగుంతల నిర్మాణం, హరితహారాన్ని విజయవంతంచేయాలని కోరారు. పరిశుభ్రతను పాటించి స్వచ్ఛభారత్‌లో ముందుండాలని సూచించారు. గ్రామానికి అవసరమైన పనులన్నింటికీ  నిధులు కేటాయిస్తానన్నారు. ప్రతీ పని నాణ్యతగా జరిగేటట్లు చూడాలని కోరారు. ప్రభుత్వ పథకాలను అర్హులు వినియోగించుకోవాలన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్‌ ఇండియా లాంటి పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. తుల రాజేందర్, సర్పంచులు వాసాల లక్ష్మి, తొట్ల లక్ష్మిచిన్నయ్య, ఆర్‌ఐ సత్యనారాయణ, వీఆర్వో షరీఫ్, కార్యదర్శి అశోక్, వినయ్, మదాం నడ్పిరాజం, రాంరెడ్డి, లింగారెడ్డి  పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement