పాత బైపాస్‌కు పునర్‌వైభవం | Revival of the old bypass | Sakshi
Sakshi News home page

పాత బైపాస్‌కు పునర్‌వైభవం

Jul 24 2016 12:01 AM | Updated on Aug 20 2018 8:20 PM

పాత బైపాస్‌కు పునర్‌వైభవం - Sakshi

పాత బైపాస్‌కు పునర్‌వైభవం

సాగర్‌లోని పైలాన్‌ ముత్యాలమ్మ గుడి నుంచి శివంహోటల్‌ వరకు గల రోడ్డుకు పునర్‌ వైభవం రానుంది. ఈ రోడ్డును పునరుద్ధరించి బైపాస్‌గా మారిస్తే హిల్‌కాలనీ రహదారులపై రద్దీ తగ్గుతుందని సాక్షి ప్రచురించిన కథనాలకు అధికారులు స్పందించారు.

నాగార్జునసాగర్‌ : సాగర్‌లోని పైలాన్‌ ముత్యాలమ్మ గుడి నుంచి శివంహోటల్‌ వరకు గల రోడ్డుకు పునర్‌ వైభవం రానుంది.  ఈ రోడ్డును పునరుద్ధరించి బైపాస్‌గా మారిస్తే హిల్‌కాలనీ రహదారులపై రద్దీ తగ్గుతుందని సాక్షి ప్రచురించిన కథనాలకు అధికారులు స్పందించారు.  ముత్యాలమ్మగుడి దగ్గరినుండి శివం హోటల్‌ వరకు 5.8 కిలో మీటర్లు  బీటీ వేసేందుకు రూ.2.77 కోట్లతో టెండర్లు పిలిచి ఆపనులను ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆగస్టు 5వ తేదీ లోగా పూర్తయ్యేలా పనులను చురుగ్గా నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement