స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 24 నుంచి రెవెన్యూ డివిజన్ వారీగా ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నట్లుగా మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరి తెలిపారు.
24 నుంచి డివిజన్ల వారీగా ఉల్లి కొనుగోళ్లు
Oct 20 2016 12:07 AM | Updated on Sep 4 2017 5:42 PM
కర్నూలు(అగ్రికల్చర్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 24 నుంచి రెవెన్యూ డివిజన్ వారీగా ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నట్లుగా మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరి తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డులోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఉల్లి నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్‌లు ఇవ్వడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక బృందాలకు సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement