చెప్పింది చేసినా వైద్యం చేయలేదు! | pregnant woman relatives protest at hospital | Sakshi
Sakshi News home page

చెప్పింది చేసినా వైద్యం చేయలేదు!

Aug 17 2016 7:43 PM | Updated on Apr 3 2019 4:22 PM

కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి వైద్యం చేయటానికి డాక్టర్లు నిరాకరించడంతో బంధువులు ఆందోళనకు దిగారు.

తాండూరు: కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి వైద్యం చేయటానికి డాక్టర్లు నిరాకరించడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రభుత్వాసుపత్రిలో బుధవారం జరిగింది. మొమిన్‌పేట మండలకేంద్రం అమృతకాలనీకి చెందిన కవిత అనే గర్భిణీకి నెలలు నిండటంతో మంగళవారం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు.

వైద్యులు గర్భిణిని పరీక్షించి కవలలు ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ చేయాలని, దీనికోసం ‘ఓ’ నెగిటివ్ రక్తం కావాలని వారికి చెప్పారు. దీంతో హైదరాబాద్ వచ్చి ఒక ప్యాకెట్ రక్తాన్ని రూ.2 వేల కొని తెచ్చారు. తెచ్చిన రక్తాన్ని డాక్టర్లకు ఇవ్వగా..ఒక ప్యాకెట్ రక్తం సరిపోదని..మరో 2 ప్యాకెట్లు కావాలని చెప్పడంతో కవిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న డాక్టర్లు తమ దగ్గర రక్తం సరిపోయేంత లేదని చెప్పి ..చివరికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement