వేములవాడ మండలకేంద్రంలోని మార్కేండయనగర్‌లో విద్యుత్ షాక్ తగిలి కోడెం అమర్‌నాథ్(3) అనే పసి బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.
వేములవాడ మండలకేంద్రంలోని మార్కేండయనగర్‌లో విద్యుత్ షాక్ తగిలి కోడెం అమర్‌నాథ్(3) అనే పసి బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. బాలుడు ఇంటి మేడపై ఐరన్ రాడ్‌తో ఆడుకుంటుండగా అదుపుతప్పి రాడ్ కరెంటు తీగలపై పడింది. కరెంటు షాక్ తగిలిన బాలుడిని రక్షించబోయి తల్లి కూడా బాలుడిని పట్టుకుంది. కరెంటు షాక్ తగిలిన వీరిద్దరినీ మరో వ్యక్తి కర్రతో కొట్టి విడిపించడంతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరినీ చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు.