అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు తీగ ఓ రైతు ప్రాణాన్ని బలి తీసుకుంది.
అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు తీగ ఓ రైతు ప్రాణాన్ని బలి తీసుకుంది. కరీంనగర్ జిల్లా మంథని మండలం కమాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాపాక శ్రీశైలం(30) గురువారం ఉదయం తన పొలానికి వెళ్తుండగా దారి పక్కన అమర్చిన కరెంటు తీగలు ప్రమాదవశాత్తు అతడిని తాకాయి. విద్యుదాఘాతానికి గురైన శ్రీశైలం అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.