కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపేటలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు ఒక యువకుడు చనిపోయాడు.
కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపేటలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు ఒక యువకుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన ముద్దం నరేష్(22) టీవీ రిపేర్ చేస్తుంటాడు. సోమవారం ఉదయం అతడు గ్రామానికే చెందిన సురేందర్ టీవీ మరమ్మతు చేయటానికి వెళ్లాడు. రిపేర్ చేస్తుండగా టీవీలోకి పొరపాటున కరెంట్ సరఫరా కావటంతో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.