కదిలిన రవాణా కార్డుల స్పీడ్‌ పోస్ట్‌... | Post cards Speed ​​shaken transport ... | Sakshi
Sakshi News home page

కదిలిన రవాణా కార్డుల స్పీడ్‌ పోస్ట్‌...

Jul 27 2016 11:40 PM | Updated on Sep 4 2017 6:35 AM

‘రవాణా’కు పోస్టల్‌ బ్రేకులు’ అనే శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితైమన కథనానికి జిల్లా రవాణాశాఖాధికారి మోహిమిన్‌ స్పందించారు.

సత్తుపల్లి టౌన్‌: ‘రవాణా’కు పోస్టల్‌ బ్రేకులు’ అనే శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితైమన కథనానికి జిల్లా రవాణాశాఖాధికారి మోహిమిన్‌ స్పందించారు. రవాణా శాఖ జారీ చేసిన కార్డుల స్పీడ్‌పోస్టుల బిల్లుల విషయంపై జిల్లా తపాల శాఖాధికారితో మాట్లాడారు. దీంతో స్పీడ్‌ పోస్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. సత్తుపల్లి తపాల శాఖ కార్యాలయంలో పెండింగ్‌లోఉన్న 823 డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ట్రాన్స్‌ఫర్, వాహనాల రిజిస్ట్రేషన్‌ కార్డులను సంబంధిత వాహనదారులకు స్పీడ్‌ పోస్ట్‌ చేశారు. ఈ కార్డులు ఏడు రోజుల్లో చేరతాయని సత్తుపల్లి పోస్ట్‌మాస్టర్‌ ఎం.వీరవెంకయ్య ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement