జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ త్రినాథరావు గురువారం చెప్పారు.
25న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
Jul 22 2016 12:58 AM | Updated on Sep 18 2018 7:45 PM
ఎచ్చెర్ల: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రవేశాలు కన్వీనర్, శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ త్రినాథరావు గురువారం చెప్పారు. పాలిసెట్ రాసిన, రాయని విద్యార్థులు సైతం అర్హులుగా చెప్పారు. స్పాట్ అడ్మిషన్లుకు ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి రూ.4,450 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి సాంకేతిక విద్యాశాఖ ఆదేశాలు మేరకు అడ్మిషన్లు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల, మహిళలు, టెక్కలి, ఆమదాలవలస, సీతంపేటతో పాటు మరో ఏడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. బ్రాంచ్‌ల్లో ఖాళీలు వివరాలను ఆయా కళాశాలలను సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement