సెప్టెంబర్‌ ఆఖరకు వెయ్యి కిలోమీటర్ల ప్లాంటేషన్‌ | plans for avenue plantation | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ ఆఖరకు వెయ్యి కిలోమీటర్ల ప్లాంటేషన్‌

Aug 17 2016 11:31 PM | Updated on Sep 4 2017 9:41 AM

సెప్టెంబరు నెలాఖరు నాటికి వెయ్యి కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సమీవేశ మందిరంలో బుధవారం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. జిల్లాలో కోటి 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయడంలో అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ తెలిపారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సెప్టెంబరు నెలాఖరు నాటికి వెయ్యి కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సమీవేశ మందిరంలో బుధవారం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. జిల్లాలో కోటి 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయడంలో అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా కేవలం 1600 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టడం శోచనీయమన్నారు. పంచాయతీ 1776 భవనాల లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ మంచినీటి సరఫరాకు సంబంధించి 25 కోట్ల నిధుల్లో కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, నందిగాం పాఠశాలలో మంచినీటి సమస్య ఉందని, దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్య పరిష్కారానికి నిధులు వెచ్చించాలని తెలిపారు. మనం–వనం కార్యక్రమంలో ఎక్కడెక్కడ మొక్కలు వేశారో వివరాలను తెలపాలన్నారు.
 
పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్‌లను నిర్వహించాలని చెప్పారు. ఇరిగేషన్‌కు సంబంధించి వంశధార భూసేకరణ మిగులు భూములలో మొక్కల పెంపకం చేపట్టేందుకు భూముల వివరాలను అందజేయాలన్నారు. నీరు–చెట్టు కార్యక్రమంలో బండ్‌ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, హార్టికల్చర్‌లపై సమీక్షించారు. పాఠశాలల్లో పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. వెదురు, మర్రి, రావి, మొక్కలను ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద వేయాలన్నారు. కార్యక్రమానికి డుమా పీడీ ఆర్‌.కూర్మనాథ్, వంశధార ఎస్‌ఈ అప్పలనాయుడు, ఈఈ రవీంద్రనా«ద్, పశుసంవర్ధకశాఖ జేడీ వెంకటేశ్వర్లు, అటవీ, గనుల శాఖ తదితర అధికారులు హాజరయ్యారు. 

Advertisement

పోల్

Advertisement