తమిళనాడులో జల్లికట్టు వేడుకల రద్దుకు నిరసనగా చేపట్టిన ఆందోళనలతో రైల్వే ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
తిరుపతి అర్బన్: తమిళనాడులో జల్లికట్టు వేడుకల రద్దుకు నిరసనగా చేపట్టిన ఆందోళనలతో రైల్వే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చెన్నై నుంచి తిరుపతికి నడుస్తున్న సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రైళ్లను సహా రెండు ప్యాసింజర్ రైళ్లను శుక్రవారం రైల్వే అధికారులు రద్దు చేశారు.
చెన్నై నుంచి రేణిగుంట, గూడూరుల మీదుగా విశా ఖపట్నం, హౌరా, ఢిల్లీ, కాచిగూడ, భువ నేశ్వర్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను తిరుపతి మీదుగా దారి మళ్లించారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన తమిళనాడు వాసులు తిరిగి వారి ఊళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి.