పాత కల్లూరు జమ్మిచెట్టు వీధికి చెందిన పర్ల మద్దయ్య (35) వడ దెబ్బకు గురై మృతి చెందాడు.
వడ దెబ్బతో వ్యక్తి మృతి
May 1 2017 11:56 PM | Updated on Sep 5 2018 2:06 PM
కల్లూరు: పాత కల్లూరు జమ్మిచెట్టు వీధికి చెందిన పర్ల మద్దయ్య (35) వడ దెబ్బకు గురై మృతి చెందాడు. మృతుని భార్య పర్ల ఈశ్వరమ్మ సమాచారం మేరకు.. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కరెంటు బిల్లు చెల్లించేందుకు చెన్నమ్మ సర్కిల్‌లోని విద్యుత్ బిల్ కౌంటర్ వద్ద ఎండలో నిలబడి సొమ్మసిల్లి కిందపడిపోయాడు. అతని సోదరుడు చిన్న మద్దయ్య ఇతరుల సహాయంతో అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు సంతానం ఉన్నారు.
Advertisement
Advertisement