అనంతపురం అర్బన్: పశ్చిమ రాయలసీమ (వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ సోమవారంతో ముగుస్తుంది. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ఉంటుంది.
21న ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన
ఉపసంహరణకు 23 ఆఖరు
అనంతపురం అర్బన్: పశ్చిమ రాయలసీమ (వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ సోమవారంతో ముగుస్తుంది. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ఉంటుంది. నామినేషన్ల ఉపసంహకరణకు 23వ తేదీ ఆఖరు గడువు. పోలింగ్ మార్చి 9న నిర్వహిస్తారు. మార్చి 15వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. జేఎన్‌టీయూ సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు.
ఇప్పటి వరకు 34 నామినేషన్లు
పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 34 నామినేషన్ దాఖలు దాఖలయ్యాయి. ఇందులో పట్టభద్ర నియోజకవర్గానికి 23 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 11 మంది నామినేషన్ వేశారు.