ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు | new districts formation as per Public opinion has | Sakshi
Sakshi News home page

ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు

Sep 8 2016 12:29 AM | Updated on Oct 17 2018 3:38 PM

ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు - Sakshi

ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు

ప్రజాభిప్రాయం, ప్రాసెస్‌ పూర్తయితేనే కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్ట త వస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శా ఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. హన్మకొండలోని టీఆర్‌ఎస్‌ అర్బన్‌ కార్యాల యంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ల ఏర్పాటు నాయకులు, ఎమ్మెల్యేల కోసం కాదని, ప్రజల అభీష్టం మేరకే ఉంటుందని స్పష్టం చేశారు.

  • నాయకులు, ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని కాదు
  • పేదల ఎజెండాగా పని చేస్తున్న ప్రభుత్వం మాది
  • ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌
  • హన్మకొండ :  ప్రజాభిప్రాయం, ప్రాసెస్‌ పూర్తయితేనే కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్ట త వస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శా ఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. హన్మకొండలోని టీఆర్‌ఎస్‌ అర్బన్‌ కార్యాల యంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ల ఏర్పాటు నాయకులు, ఎమ్మెల్యేల కోసం కాదని, ప్రజల అభీష్టం మేరకే ఉంటుందని స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో వచ్చిన స్పందనపై సీఎం కేసీఆర్‌ సరైన నిర్ణయం తీసుకుంటారని, ప్రజల కోరిక మేరకే జిల్లాలుంటాయని అన్నా రు. జిల్లాలు ఏర్పాటుకు అనుగుణంగా  కేం ద్రం నియోజకవర్గాల పునర్విభజన చేస్తుందని ఆశిస్తున్నామని, లేదంటే 2029 వరకు ఈ నియోజకవర్గాలే ఉంటాయని అన్నారు. ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే అధిష్టానమని అన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో రాష్ట్ర స్థాయి చైర్మన్లను మాత్రమే కేసీఆర్‌ నియమిస్తారని, డైరెక్టర్లు, దేవాలయాల చైర్మన్‌ల ఎంపిక ఎమ్మెల్యేలదేనని చెప్పారు. 
     
    చేతలతో సమాధానం
    ఆనాడు హేళన చేసిన నాయకులకు నేడు చేతల ద్వారా సమాధానం చెపుతున్నామని ఈటల అన్నారు. గులాబీ జెండా ఎత్తిన వారు ఇతర పార్టీల్లోకి వెళ్లలేదని, ఆనాడు వెకిలి మాటలు మాట్లాడిన పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున వచ్చారని గుర్తు చేశారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించామో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు.  పేదల ఎజెండాతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన తనకు అందరి మనోభావాలు తెలుసని, ప్రభుత్వం చేపట్టనున్న నామినేటెడ్‌ పదవుల్లో కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని అన్నారు.
     
    టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నవారే అసలైన నాయకులని అన్నారు. అనంతరం మంత్రి ఈటలను సన్మానించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గుడిమల్ల రవికుమార్, మర్రి యాదవరెడ్డి, కె.వాసుదేవరెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, మాడిశెట్టి శివశంకర్, నయీముద్దీన్, జకార్య, నారాయణ, రాజేంద్రకుమార్, డిప్యూటీ మేయర్‌ సిరాజుద్దీన్, కార్పొరేటర్లు విజయ్‌భాస్కర్, మిర్యాల్‌కార్‌ దేవేందర్, వి.రవీందర్, టి. విద్యాసాగర్, జోరిక రమేష్, డిన్నా, నల్ల స్వ రూపరాణి, మాధవి, మిడిదొడ్డి స్వప్న, అరు ణ, సాబియా సబాహత్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement