నారాయణపురంలో జ్వరాలు | Narayanapuram lo fevers | Sakshi
Sakshi News home page

నారాయణపురంలో జ్వరాలు

Aug 12 2016 12:20 AM | Updated on Jun 13 2018 8:02 PM

నారాయణపురంలో జ్వరాలు - Sakshi

నారాయణపురంలో జ్వరాలు

మండలంలోని నారాయణపురం గ్రామంలో జనం జ్వరాలతో బాధపడుతున్నారు. ఇంటికొక్కరు జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు.

  • ∙వైద్యం అందక అవస్థలు
  • నారాయణపురం(కురవి): మండలంలోని నారాయణపురం గ్రామంలో జనం జ్వరాలతో బాధపడుతున్నారు. ఇంటికొక్కరు జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు.
    నారాయణపురం గ్రామానికి చెందిన నిమ్మల రాజమల్లు, గాదె పిచ్చమ్మలతోపాటు మరికొందరు జ్వరంతో మంచం పట్టారు. వైద్య సిబ్బంది సకాలంలో వైద్యం అందించడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రభలుతున్నా గ్రామంలో వైద్య సేవలందించకపోవడంతోనే జ్వరంతో స్థానికులు బాధపడాల్సి వస్తుందని తెలిపారు. వెంటనే వైద్య సేవలందించాలని కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement