ఎంసీఐ విస్తృత తనిఖీలు | MCI searches continues for the second day | Sakshi
Sakshi News home page

ఎంసీఐ విస్తృత తనిఖీలు

Sep 1 2016 12:05 AM | Updated on Oct 20 2018 6:19 PM

ఎంసీఐ విస్తృత తనిఖీలు - Sakshi

ఎంసీఐ విస్తృత తనిఖీలు

నెల్లూరు(అర్బన్‌) : దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో రెండో రోజు బుధవారం ఎంసీఐ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఎంసీఐ టీం చైర్మన్, పాట్నా మెడికల్‌ కళాశాల ఫిజియాలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ ఎస్‌ఎన్‌శర్మ ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు.

 
నెల్లూరు(అర్బన్‌) : దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో రెండో రోజు బుధవారం ఎంసీఐ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఎంసీఐ టీం చైర్మన్, పాట్నా మెడికల్‌ కళాశాల ఫిజియాలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ ఎస్‌ఎన్‌శర్మ ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు. ల్యాబ్, ఎక్స్‌రే, థియేటర్, ఎమర్జెన్సీ విభాగాలను పరిశీలించారు. ప్రిన్సిపల్, డాక్టర్లతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. మెడికల్‌ కళాశాల అభివృద్ధికి చేపట్టిన చర్యలు గురించి  ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవిప్రభు ఎంసీఐ బృందానికి వివరించారు. సంగం పీహెచ్‌సీలో మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా హౌస్‌ సర్జన్‌ కోసం నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు.  ప్రిన్సిపల్‌ రవి ప్రభు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన నెల్లూరు మెడికల్‌ కళాశాల వసతులపై ఎంసీఐ బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. ఎంసీఐ తనిఖీ బృందంలో రాయపూర్‌కు చెందిన జేఎన్‌ఎం మెడికల్‌ కళాశాల గైనకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నళినిమిశ్రా, తమిళనాడు సేలం జిల్లాకు చెందిన మోహన్‌కుమార్‌మంగళం మెడికల్‌ కళాశాల పెథాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తెన్మాజి ఉన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ రవిప్రభు, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి, డాక్టర్‌ నిర్మల, కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సీకే లక్ష్మీదేవి(అడ్మిన్‌), వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాధాకృష్ణరాజు(అకడమిక్‌) తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement