పాలమూరు శుభారంభం | mbnr win | Sakshi
Sakshi News home page

పాలమూరు శుభారంభం

Sep 9 2016 11:37 PM | Updated on Sep 4 2017 12:49 PM

పాలమూరు శుభారంభం

పాలమూరు శుభారంభం

రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్‌–14నెట్‌బాల్‌ టోర్నీలో ఆతిథ్య పాలమూరు జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని జెడ్పీ మైదానంలో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన బాలబాలికల జట్టు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో ఏకపక్షంగా జరిగిన తొలి మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 10–1గోల్స్‌ తేడాతో మెదక్‌ను చిత్తు చేసింది.

  •  మెదక్‌పై ఘనవిజయం 
  •  రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 నెట్‌బాల్‌ టోర్నీ
  • మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్‌–14నెట్‌బాల్‌ టోర్నీలో ఆతిథ్య పాలమూరు జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని జెడ్పీ మైదానంలో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన బాలబాలికల జట్టు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో ఏకపక్షంగా జరిగిన తొలి మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 10–1గోల్స్‌ తేడాతో మెదక్‌ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో 5గోల్స్‌తో దూసుకెళ్లిన జిల్లా జట్టు రెండో అర్ధభాగంలో అదే జోరును కొనసాగించి మరో ఐదు గోల్స్‌ చేసింది. బాలికల విభాగంలో తొలిమ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు బోణీ కొట్టింది. ఆ జట్టు 4–1గోల్స్‌ తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. తొలి, రెండు సెషన్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు రెండేసి గోల్స్‌ సాధించారు. 
     
    ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎదగాలి
    క్రీడల్లో ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధా అమర్‌ పిలుపునిచ్చారు. ఎస్‌జీఎఫ్‌ నెట్‌బాల్‌ టోర్నీ ప్రారంభోత్సవానికి ముందుగా ఆమె క్రీడ పతాకాన్ని ఎగురవేసి, క్రీడాకారుల నుంచి వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జిల్లాలో నైపుణ్యం గల క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తే మరింతగా రాణిస్తారని తెలిపారు. అన్ని రకాల క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టోర్నీలో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ గతంలో జిల్లా కేంద్రంలో జాతీయస్థాయి నెట్‌బాల్‌ టోర్నీలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. పదేళ్ల తర్వాత నెట్‌బాల్‌ టోర్నీ నిర్వహిస్తున్నామని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి టోర్నీలో రాణించిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపిక చేస్తామని చెప్పారు. అక్టోబర్‌ మొదటివారంలో జిల్లా కేంద్రంలోనే జాతీయస్థాయి అండర్‌–14 నెట్‌బాల్‌ టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వెంకటరామారావు, కృష్ణమూర్తి, రాములు, విలియమ్స్, జగన్‌మోహన్‌గౌడ్, రామేశ్వర్, సాదత్‌ఖాన్, సొహైల్‌ వుర్‌ రహెమాన్, పరుశరాముడు, నాగరాజు, ముకర్రం, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement