యువకుడు ఆత్మహత్య | man suicides in 43 udegolam | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్య

May 31 2017 11:30 PM | Updated on Nov 6 2018 8:28 PM

కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన కె.ఖలీల్‌బాషా (20) బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.

కణేకల్లు (రాయదుర్గం) : కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన కె.ఖలీల్‌బాషా (20) బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ యువరాజు తెలిపిన మేరకు.. 43 ఉడేగోళం గ్రామానికి చెందిన కె.సర్మస్‌వలీ ఆర్టీసీ డ్రైవర్‌. ఇతనికి నలుగురు కుమారులు. ముగ్గురు కుమారులు వివిధ వృత్తి పనులు చేస్తున్నారు. నాల్గో కుమారుడైన కె.ఖలీల్‌బాషా డిగ్రీ చదివాడు. ఏడాది నుంచి మానసిక వ్యాధితో బాధపడేవాడు.

జీవితంలో ఏమీ చేయలేని, ఇక తాను బతికి ఉండటం వృథా అని పలుమార్లు తల్లిదండ్రులతో  చెప్పేవాడు. మానసికవ్యాధి నయం అవుతుందని తల్లిదండ్రులు ధైర్యం చెప్పేవారు. ఈ క్రమంలో పలువురు డాక్టర్లతో చికిత్స చేయిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో అందరూ భోజనం చేశారు. తల్లి ఇంటి బయట ఉన్న సమయంలో ఖలీల్‌ బెడ్‌రూమ్‌లోకెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement