రైలు కిందపడి వ్యక్తి మృతి | man dies of train accident | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి మృతి

Mar 18 2017 11:46 PM | Updated on Sep 5 2017 6:26 AM

స్థానిక రైల్వే జంక్షన్‌ సమీపంలోని సౌత్‌ కేబిన్‌ వద్ద డోన్‌కు వెళ్లే రైలు మార్గంలో(442/4 కిలోమీటర్‌ వద్ద) ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు.

గుంతకల్లు : స్థానిక రైల్వే జంక్షన్‌ సమీపంలోని సౌత్‌ కేబిన్‌ వద్ద డోన్‌కు వెళ్లే రైలు మార్గంలో(442/4 కిలోమీటర్‌ వద్ద) ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుని చొక్కా జేబులో లభ్యమైన రేషన్‌కార్డు నకలు ఆధారంగా అతడిని పట్టణంలోని బెంచికొట్టాలకు చెందిన రహంతుల్లా(50)గా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కార్పెంటర్‌ పని చేసే రహంతుల్లాకు తాగుడు అలవాటు తప్ప ఎవరితోనూ గొడవలు లేవని ఆయన భార్య బేగం, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది ఆత్మహత్యా, ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement