ఏ కష్టమొచ్చిందో.. | man dies of train accident | Sakshi
Sakshi News home page

ఏ కష్టమొచ్చిందో..

Dec 28 2016 10:24 PM | Updated on Sep 4 2017 11:49 PM

ఏ కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తి రైలుకింద పడి ప్రాణం తీసుకున్నాడు.

కదిరి టౌన్‌ : ఏ కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తి రైలుకింద పడి ప్రాణం తీసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కదిరి రైల్వేస్టేషన్‌కు ఫర్లాంగు దూరంలోని బ్రిడ్జి సమీపాన ట్రాక్‌పై ఓ వ్యక్తి తలపెట్టి పడుకున్నాడు. ఆ మార్గంలో వచ్చిన గుంతకల్లు- తిరుపతి ప్యాసింజర్‌ రైలు దూసుకెళ్లడంతో ఆ వ్యక్తి తల, మొండెం వేరయ్యాయి. ఈ భయానక దృశ్యాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు. అయితే మృతుడి వివరాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement